దుబ్బాక మున్సిపల్ నూతన కమిషనర్ గా మట్ట శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతల్ని స్వీకరించారు. హైదరాబాద్ సీడీఎంఏ కార్యాలయం నుండి దుబ్బాకకు బదిలీపై వచ్చారు. ఇదివరకు కమిషనర్ గా పనిచేసిన కళ్యాణం రమేష్ కుమార్ దుబ్బాక నుండి కామారెడ్డి మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు.