మాక్లూర్ సీతారామాంజనేయ మంగళ పూజ, అన్నదానం

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలోని శ్రీ సీతా రామాంజనేయ ప్రతిష్టాపన చేసి 41వ రోజులు అవుతున్న సందర్భంగా మండప పూజ, అన్నదాన కార్యక్రమం బుదవారం ఆలయ కమిటి అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా  శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో మండల పూజా మహోత్సవం,  ఉదయం విగ్రహాలకు అభిషేకం, మధ్యాహ్నం అన్న ప్రసాదం, సాయంత్రం పల్లకీ సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.