నిర్మాత సూర్యదేవర రాధాకష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. ఈ చిత్రాన్ని రక్షా బంధన్ రోజున సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వినోదభరితంగా సాగిన టీజర్‌కి వస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ సినిమాని ఈనెల 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవు తున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.