‘మ్యాడ్‌ స్క్వేర్‌’ రిలీజ్‌కి రెడీ

'Mad Square' is ready for releaseబ్ల్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘మ్యాడ్‌’కి సీక్వెల్‌గా ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో ‘మీరు హ్యాండిల్‌ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్‌ నెస్‌’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడు. సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: శామ్‌దత్‌, కూర్పు: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: శ్రీ నాగేంద్ర తంగాల, అదనపు స్క్రీన్‌ ప్లే: ప్రణరు రావు తక్కళ్లపల్లి, కళ: పెనుమర్తి ప్రసాద్‌.