ఐఎన్టియుసి సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మడ్డి రాజ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేశారు.ఆర్ జి-3 ఏరియా ఓసిపి-2 కి చెందిన మడ్డి రాజకుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత ఎమ్మెల్యే, ఎంపీ, ఐఎన్టీయూసీ యూనియన్ ఎన్నికల్లో లో కీలక పాత్ర పోషించినందుకు తన సేవలను గుర్తించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ (ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్) జనక్ ప్రసాద్ సహకారంతో ఐఎన్టీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఇచ్చినటువంటి పదవికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, ఐఎన్టియుసి యూనియన్ కి, కార్మిక వర్గానికి ఎల్లవేళలా సేవ చేస్తానని ఈ సందర్భంగా రాజ్ కుమార్ పేర్కొన్నారు.