ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు: మద్దికుంట నర్సాగౌడ్

నవతెలంగాణ- రామారెడ్డి
రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని, అధికార పార్టీ మోసపూరిత హామీలను ప్రజలు నమ్మబోరని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గురువారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నరస గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంతో పాటు రెడ్డిపేటలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాయిని నర్సింలు, కుమ్మరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.