రాష్ట్రస్థాయి కవి సమ్మేళనానికి మద్దోజు సుధీర్ బాబు కవిత ఎంపిక

నవతెలంగాణ – చండూరు  
చండూరు సాహితీ మేఖల సభ్యులు, తెలుగు భాషోపాధ్యాయుడు మద్దోజు సుధీర్ బాబు రాష్ట్రస్థాయి కవి సమ్మేళనానికి ఎంపికయ్యారు.
తెలంగాణ కవుల సంఘం,కళాసూర్య కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న రవీంద్రభారతిలో నిర్వహించే  రాష్ట్రస్థాయి కవి సమ్మేళనానికి సుధీర్ బాబు రచించిన ‘ధర్మగంట’ అనే కవిత ఎంపికయింది. కవిత చదివి వినిపించడానికి సంస్థల నిర్వాహకులు సుతారపు వెంకటరమణ, అనుముల ప్రభాకరాచారిల నుండి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ సాహితీవేత్తలు కొలకలూరి ఇనాక్, సుధామ, విహారి, గిరిజా మనోహర్ బాబు తదితరులు అతిథులుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబును పలువురు ప్రముఖులు అభినందించారు.