‘మేడ్ ఇన్ ఇండియా’ ఫస్ట్-ఎవర్ BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్

ఇది పెద్దది, ఇది ఒక ఎస్‌యువి SUV, ఇది ఒక ఈవీ EV, ఇది ఒక BMW.

‘మేడ్ ఇన్ ఇండియా’ ఫస్ట్-ఎవర్ BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది.

లాంగ్-వీల్‌బేస్: అత్యంత విశాలమైన రెండవ సీటు వరుసతో ఈ విభాగంలో అతిపెద్ద కారు.

ఆధిపత్య డిజైన్ మరియు క్లాస్- లీడింగ్ సాంకేతికతతో వెర్సటైల్ SUV.

భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసిన ఫస్ట్-ఎవర్ ఎలక్ట్రిక్ BMW.

ఇది 531 కిలోమీటర్ల పరిధి వరకు హాల్‌మార్క్ BMW పనితీరు.

వినియోగదారులు EV ప్రయాణాలను సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకునేందుకు స్మార్ట్ ఇ-రౌటింగ్ మరియు ఛార్జింగ్ కన్సైర్జ్‌ను పరిచయం చేస్తోంది. ఆటో ఎక్స్‌పో 2025 లో BMW ఇండియా ఫస్ట్- ఎవర్ BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేసింది. ఈ కారును నేటి నుంచి భారతదేశం అంతటా BMW డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

‘మేడ్ ఇన్ ఇండియా’గా BMW నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ నిలిచింది. చెన్నైలోని BMW గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేసిన BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ ప్రత్యేకంగా eDrive20L డ్రైవ్‌ట్రెయిన్‌లో అందుబాటులో ఉంది. విక్రమ్ పవా, ప్రెసిడెంట్ మరియు CEO, BMW గ్రూప్ ఇండియా మాట్లాడుతూ, “నేడు, BMW మొట్టమొదటి X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్‌ను విడుదల చేయడం ద్వారా భారతీయ ప్రీమియం ఆటోమోటివ్ విభాగంలో ఒక విప్లవానికి నాంది పలికింది. ఇది పెద్దది, ఇది ఒక SUV, ఇది ఒక EV మరియు ఇది ఒక BMW! అదే విధంగా X1 లాంగ్ వీల్‌బేస్ నిత్యం, మీ మార్గంలో ఆధిపత్యం చెలాయించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఆచరణాత్మకత మరియు స్థిరత్వాన్ని అందించే ప్రీమియం సమర్పణ, అన్నీ ఒకే ప్యాకేజీలో, ఇది మీ మొదటి BMWగా స్పష్టమైన ఎంపికగా చేస్తుంది. స్థలం, సౌకర్యం మరియు బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ, ఇది కొత్త భారత్  పెరుగుతున్న ఆకాంక్షలకు సరైన ప్రీమియం SUV. అదేవిధంగా, BMW నుంచి వచ్చిన మొట్టమొదటి ‘మేడ్ ఇన్ ఇండియా’ EV గా, X1 లాంగ్ వీల్‌బేస్ ఆవిష్కరణ మరియు శ్రేష్ఠత  కొత్త యుగాన్ని ఆహ్వానిస్తోంది.  దీని గురించి పవా మరింత వివరిస్తూ, “ఫస్ట్-ఎవర్ X1 లాంగ్ వీల్‌బేస్ కర్వ్ కన్నా ముందుండే, రాజీపడని ఆధునిక జీవనశైలి కలిగిన వ్యక్తులకు అనువైనది. ఇది BMW ఇండియా స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లాన్స్, డెస్టినేషన్ ఛార్జింగ్, స్మార్ట్ ఇ-రౌటింగ్, ఛార్జింగ్ కన్సైర్జ్ వంటి కొత్త సేవలతో విస్తృతమైన EV పర్యావరణ వ్యవస్థతో కూడిన సమగ్ర పరిష్కారాన్ని అందించడం ద్వారా మీ అనుభవాన్ని అధిగమించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో చాలా సబ్‌స్టెన్స్ నిండి ఉండటంతో, X1 లాంగ్ వీల్‌బేస్ ‘ది వన్’ ఆకాంక్షాత్మక SUV’’ అని వివరించారు. మొట్టమొదటి BMW X1 లాంగ్ వీల్‌బేస్ ఆల్ ఎలక్ట్రిక్ eDrive20L M స్పోర్ట్ యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర INR 49,00,000.