ఉమ్మడి జిల్లా ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శిగా మధిర మల్లేశం

నవతెలంగాణ – భువనగిరి

భువనగిరి పట్టణానికి చెందిన శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మధిర మల్లేశంను నల్లగొండ లో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలంగాణ  ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యం సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు కళాశాలల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తానని, సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు  నిరంతరం పోరాటం చేసి ప్రభుత్వం నుండి  వచ్చే నిధులను వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వారిని  పలువురు ప్రవేట్ జూనియర్ కళాశాల యాజమాన్యలు మరియు  విద్యార్థి సంఘ నాయకులు  శుభాకాంక్షలు తెలిపారు.