వైద్యులు మధు శేఖర్ ను సన్మానించిన మహిళా సంఘం నాయకురాలు

నవతెలంగాణ -ఆర్మూర్ 

పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు మధు శేఖర్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ చైర్మన్ గా నియమించబడిన సందర్భంగా మంగళవారం మహిళా సంఘం నాయకురాలు శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనజ పుష్ప, లక్ష్మి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.