మధురం హిట్‌ ఖాయం

మధురం హిట్‌ ఖాయం– హీరో నితిన్‌
ఉదరు రాజ్‌ హీరోగా, వైష్ణవి సింగ్‌ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై రాజేష్‌ చికిలే దర్శకత్వంలో నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తున్న చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్‌ లవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. టీనేజ్‌ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, సెన్సార్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను హీరో నితిన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఉదరు రాజ్‌, దర్శకుడు రాజేష్‌ చికిలే, నిర్మాత బంగార్రాజు, ప్రొడక్షన్‌ మేనేజర్స్‌ వర్మ, టోనీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో నితిన్‌ మాట్లాడుతూ, ‘టీజర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. డెఫినెట్‌గా మంచి హిట్‌ అవుతుంది. స్వీట్‌, ఇన్నోసెంట్‌, జెన్యూన్‌గా ఉంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ లవ్‌ స్టోరీలా ఇది ప్రేక్షకుల్ని మెప్పించి, మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
‘నిర్మాత బంగార్రాజు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. దర్శకుడు రాజేష్‌ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నాకు టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది’ అని హీరో ఉదరు రాజ్‌ చెప్పారు. దర్శకుడు రాజేష్‌ చికిలే మాట్లాడుతూ, ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్‌ లవ్‌ స్టోరీ ఇది. అప్పటి స్కూల్‌ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాం. సినిమా చూశాక మీ స్కూల్‌ డేస్‌.. కాలేజ్‌ డేస్‌ గుర్తొస్తాయి’ అని అన్నారు. నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ, ‘మా సినిమా టీజర్‌ లాంచ్‌ చేసిన నితిన్‌కి థ్యాంక్స్‌. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులందరికీ ఈ చిత్రం నచ్చేలా ఉంటుంది. సినిమా అంతా కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం సెన్సార్‌ వర్క్‌ జరుగుతోంది. అతి త్వరలోనే సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని చెప్పారు.