నందనీ క్రియేషన్‌ ప్రచారకర్తగా మాధురీ దీక్షిత్‌

న్యూఢిల్లీ : జైపూర్‌ కుర్తీ, దేశీ ఫ్యూజన్‌ బై జైపూర్‌ కుర్తీ బ్రాండ్ల మాతృసంస్థ నందనీ క్రియేషన్‌ తన బ్రాండ్‌ అంబాసీడర్‌గా బాలీవుడ్‌ నటీ మాధురీ దీక్షిత్‌ను నియమించుకుంది. మా బ్రాండ్‌ ముఖ చిత్రంగా మాధురీ దీక్షిత్‌ ఉండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని, ఈ భాగస్వామ్యం మా కస్టమర్‌లతో మెరుగ్గా కనెక్ట్‌ అవ్వడానికి, మా బ్రాండ్‌ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరింత దోహదం చేయనుందని విశ్వసిస్తున్నామని నందిని క్రియేషన్‌ లిమిటెడ్‌ సిఎండి అనుజ్‌ ముంద్రా పేర్కొన్నారు.