హుస్నాబాద్ బి అర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా గంగం మధుసుదన్ రెడ్డిని సోమవారం హుస్నాబాద్ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నియమించారు. పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి వివిధ గ్రామాల పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.