కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, ద్రోహం: మాజీ స్పీకర్ మధుసూదనా చారి

– తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ –  మల్హర్ రావు
కాంగ్రెస్ అంటేనే మోసమని, తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని,ఇచ్చిన హామీలను నిలబెట్టుకొలేక పోగా, తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయి, తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీదీ కక్షరూప ధోరనీ,రాష్ట్ర ఆర్ధిక వృద్ధి రేటు 20 శాతం పెంచుతామని అంటున్నారు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కాలేదుఇలాంటి సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో కాంగ్రెస్ దిట్ట, పార్లమెంట్ ఎన్నికలను వేదికగా మలచుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం మంథనిలో పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ప్రతి కార్యకర్త కు పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలు మనోధైర్యాన్ని ఇచ్చారు.
మంథని లో కాంగ్రెస్ పార్టీ కోట్లు ఖర్చు చేసినా 72 వేల ఓట్లు బీ ఆర్ ఎస్ కు వచ్చాయంటే మామూలు విషయం కాదని చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన మహా నాయకుడు కేసీఆర్ న్నారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు, నీళ్ళు, కరెంట్ గతంలో వుండేవా?బీఆర్ఎస్ వచ్చాక గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయో ప్రజలకు తెలుసు, సోషల్ మీడియా ద్వారా కావాలనే పదేళ్లు తప్పుడు ప్రచారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, పదే పదె చెప్తే, తప్పు కూడా ఒప్పుగా కనిపిస్తుంది, బీఆర్ఎస్ విషయంలో అదే జరిగిందన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి చేయడం గురించే ఆలోచించింది, చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించడం లో విఫలం అయ్యాం అందుకే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారన్నారు.ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారుఅధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలేదు పార్లమెంట్ ఎన్నికల పేరు చెప్పి హామీల అమలు జాప్యం చేస్తున్నారు హామీల అమలు కావాలంటే ఎంపి సీట్లు గెలిపించాలని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు రెండు నెలలు గడిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలే తరిమికొడతారు, కాంగ్రెస్ దొంగ బుద్ది ప్రజలకు అర్దం అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలిప్రతి కార్యకర్తకు బీ ఆర్ ఎస్ పార్టీ  అండగా ఉంటారు. గడపగడప కు సంక్షేమ పథకాలు చేరిన విజయం సాధించలేక పోయాం, బీ ఆర్ ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించడంలో విఫలం అయ్యాం అభివృద్ధి గురించి ఆలోచించాం కానీ, ప్రచారాలకు దూరంగా ఉన్నాం అందుకే తప్పుడు ప్రచారాలే, సత్య ప్రచారాలు అయ్యాయి, ఓటమికి ఇదే తొలి కారణం పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ జెండా ఎగరాలి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడం లేదు.
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు.మంథని లో ఒకే కుటుంబ పాలన కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ నోట్ల సంచులతో కోట్లు పంచి అధికారం లోకి వచ్చారు. అయినా 72 వేల ఓట్లు నాకు వేశారు అంటే నేను చేసిన సేవలే హ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నన్ను చంపాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపే నన్ను చంపాలని చూస్తున్నారు పెద్దపల్లి జడ్పీటిసి లను కాంగ్రెస్ పార్టీ ప్రలోబాలకు గురి చేసిన ఎవరు కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అండగా వుంటాన్నారు.