ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన చారి

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల ఎం ఈ ఓ గా మధుసూదనా చారి  కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మండలంతో పాటు కరీంనగర్, అర్బన్, రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, శంకరపట్నం, లో విధులు నిర్వహించనున్నట్లు, ఆయన తెలిపారు. అనంతరం వివిధ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు కార్యాలయ సిబ్బంది తదితరులు ఆయనను అభినందించారు.