మాదిగ దండోరా రజతోత్సవాలను విజయవంతం చేయాలి

– ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగపల్లి సాయిలు.
నవతెలంగాణ – రాయపోల్
జులై 7న రవీంద్రభారతి హైదరాబాద్ లో నిర్వహించే మాదిగ దండోరా రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగపల్లి సాయిలు పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హలో మాదిగ చలో హైదరాబాద్ కు ప్రతి గ్రామం నుండి  దండోరా నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. రజతోత్సవ వేడుకలలో మాదిగ మృతవీరుల కుటుంబాలకు ఘన సన్మానాలు ఉంటాయని అలాగే ఉద్యమంలో భాగంగా కేసులు జైలు జీవితం అనుభవించిన నాయకులు కార్యకర్తలను కూడా సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి పదిమంది చొప్పున అధిక సంఖ్యలో హాజరై రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.