ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగలకు ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధం కావడానికై మాదిగల ధర్నా యుద్ధ మహాసభ నవంబర్ 3న చలో కామారెడ్డి కార్యక్రమం విజయవంతం కొరకు మాదిగలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గోజేగావ్ విజయ్ శుక్రవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోజేగావ్ విజయ్ కామారెడ్డి ఎమ్మార్పీఎస్ ప్రతినిధి,మేత్రి మారుతి మండల అధ్యక్షులు,భీమ్ రావ్,సలదారుడు ఉపాధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.