నవతెలంగాణ-తిరుమలగిరి : నవంబర్ 7 తారీఖున హైదరాబాద్లో జరిగే మాదిగల విశ్వరూప మహాపాదయాత్ర బహిరంగ సభను విజయవంతం చేయాలని తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చల్లగుండ్ల సోమన్న మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానకి రాములు కరపత్ర ఆవిష్కరణ గావించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సోమన్న మాదిగ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ఇప్పటికి 9 1/2 సంవత్సరాలు గడిచిన ఎస్సి ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడక పోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. పార్లమెంటు సమావేశంలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానకి రాములు, జిల్లా నాయకులు ఆర్ యాదయ్య మాదిగ, బి నాగార్జున మాదిగ, కే అంజయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు.