మాదిగలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

– 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి..
– ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో..
– మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
కేంద్ర ప్రభుత్వం మాదిగలని   ఏబిసిడి వర్గీకరణ పేరుతో మాదిగల విస్మరిస్తుందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ని ఓడించాలని మాదిగ జేఏసీ చైర్మన్  మాజీ ఎస్సీ కార్పొరేషన్ తొలి చైర్మన్ పిడమర్తి రవి అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మాదిగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయకుండా అనేక కమిటీల పేరుతో  కాలయాపన చేస్తూ మాదిగలను అన్ని రంగాల్లో ఎదగనీయకుండా చేసిందని విమర్శించారు.  మాదిగలకు జనాభా దామాషా ప్రకారం  విద్య, వైద్య, రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలు సత్తా చూపాలని పిలుపునిచ్చారు. మాదిగలంతా తమ హక్కుల సాధనకై ఐక్యంగా ఉద్యమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఎడ్వర్డ్, యూత్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్, మాదిగ జేఏసీ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షుడు జెఫన్యా, యూత్ అధ్యక్షులు బెజవాడ శ్రవణ్, కోదాడ అధ్యక్షుడు నూక పంగు ఈదయ్య,  హుజుర్ నగర్  అధ్యక్షుడు రాం సైదులు,న్యాయవాదుల జేఏసీ సంఘం అధ్యక్షుడు మామిడి మట్టయ్య, బచ్చల కూరి జానయ్య, గరిడేపల్లి ఎంపీటీసీ కడప ఇసాక్, కొండమీద వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.