తమ ఉదారత్వాన్ని చాటుకున్న మేడికొండ కాంగ్రెస్ నాయకులు

– మేడికొండ రోడ్డు గుంతలను సొంత ఖర్చులతో మొరం కొట్టించి పూడ్చిన కాంగ్రెస్ నాయకులు ‘మేడికొండ రఫీ”,సిద్దు
నవతెలంగాణ – అయిజ
అయిజ మండల కేంద్రం నుండి మేడికొండకు వెళ్లే బీటీ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా గుంతలు పడి ప్రయాణికులు విపరీతమైన ఇబ్బంది పడుతుండడంతో అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో మేడికొండ గ్రామ కాంగ్రెస్ నాయకులైన మేడికొండ రఫీ సిద్దులు కలసి ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ..రోడ్డుకు ఇరువైపులా మొరం ట్రాక్టర్లతో మట్టిని కొట్టించి దాదాపు 50 మంది గ్రామ యువకులతో మట్టిని పూడిపించడం జరిగింది.మేడికొండ రఫీ ,సిద్దు ఇద్దరు కలిసి తమ సొంత ఖర్చులతో దాదాపు పది ట్రాక్టర్లను పెట్టి 60 ట్రిప్పులు దాకా మొరం వేయించి రోడ్డు గుంతలను పూడిపించారు. మేడికొండ రోడ్డు వెంట అనేక గ్రామాలైన తుపత్రాల ,మేడికొండ ,పులికల్లు ,రాజాపురం ,బైనపల్లి ,అనేక గ్రామాలు ఉండడంతో ఈ రోడ్డు విపరీతమైన రద్దీ ఉంటుంది రోడ్డు వెంట విపరీతమైన గుంతలు ఉండడంతో ఎంతోమంది ప్రయాణికులు కిందపడి కాళ్లు చేతులు విరగడంతో పాటు ప్రాణాలు పోగొట్టుకున్న… సంబంధిత అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గాని స్పందించకపోవడం మా దురదృష్టమని ఆ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రాత్రయితే చిన్నపిల్లలను గర్భిణులను హాస్పిటల్ కు రావాలంటే తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి విషయాన్ని గ్రహించిన మేడికొండ కాంగ్రెస్ నాయకులు మేడికొండ రఫీ సిద్దు ఇద్దరు వారి సొంత ఖర్చులతో రోడ్లకు మట్టిని వేయించి ప్రయాణికులకు కాస్త వెసులుబాటు కల్పించారు. ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు రోడ్డు వేయించాలని ప్రాధేయపడ్డారు.