
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాదిరెడ్డి ముకుందా రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రుణమాఫీతో కొన్ని లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాతిఅని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షామని, రైతు రుణమాఫీ చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.