పువ్వులు,పండ్లు అమ్మకాలతో కళకళలాడిన మద్నూర్ పాత బస్టాండ్

– కిలో బంతి పువ్వులు రూ.100

నవ తెలంగాణ మద్నూర్
గురువారం దీపావళి పండుగను పురస్కరించుకొని మద్నూర్ పాత బస్టాండు ఆవరణంలో పండ్లు ఫలహాలు బంతి పువ్వులు అమ్మకాలతో పాత బస్టాండ్ కళకళలాడింది దీపావళి పండుగ అమావాస్య గురువారం కావడంతో దీపావళి పండుగకు కావలసిన పండ్లు ఫలహాలు బంతి పువ్వులు అమ్మకాలు జోరందుకున్నాయి పండ్లపలహాల రేట్లు బాగా పిరంగ ఉన్నప్పటికీ బంతిపూలు మాత్రం కిలో 100 రూపాయల చొప్పున వ్యాపారాలు కొనసాగుతున్నాయి మద్నూర్ మండల కేంద్రంలో దీపావళి పండుగ గురువారం వ్యాపార సముదాయాల వారు జరుపుకొనుండగా ఇతరులు పాడ్యమి పూజలుగా శుక్రవారం జరుపుకునేందుకు పండుగ ఏర్పాట్లల్లో భాగంగా పువ్వులు పండ్లు ఫలాలు జోరుగా కొనుగోలు చేస్తున్నారు