మద్నూర్ పాత బస్టాండులో సౌకర్యాలు కరువు..

– మూత్రశాలలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

– ప్రయాణికులు ఎక్కువ, బస్సు సర్వీసులు తక్కువ
– బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు
– కిక్కిరిసిన ప్రయాణికులతో కళకళలాడుతున్న మద్నూర్ పాత బస్టాండ్
– ఎమ్మెల్యే కృషి ఏమైంది? మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మాణం ఎక్కడ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ పాత తాలూకా కేంద్రం ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర కర్ణాటక, మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరియోద్దులో ఉండటం విశేషం మూడు రాష్ట్రాలకు తరలి వెళ్లే ప్రయాణికులు ఇక్కడి నుండే వెళ్లాలి. మద్నూర్ పాత బస్టాండులో ప్రయాణికులకు సౌకర్యాలు కరువయ్యాయి. మూత్రశాలలు మరుగుదొడ్లు లేక మహిళలు గాని పురుషులు గాని నాన్న ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. మూత్రం వచ్చిన మరుగుదొడ్డికి వెళ్లాలన్న అసలు సౌకర్యాలు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నారు. ఇలాంటి సమస్యల గురించి నవతెలంగాణ పలుమార్లు పత్రికల్లో ప్రచురించడం జరిగింది. పత్రికల్లో వచ్చిన వార్తలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పందించారు. ప్రయాణికుల ఇబ్బందులు దూరం చేసేందుకు మూత్రశాలలు మరుగుదొడ్ల నిర్మాణం కోసం వెంటనే నాలుగు లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు మద్నూర్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి విలేకరుల సమావేశంలో వెల్లడించడం జరిగింది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా.. ఎమ్మెల్యే కృషి ఏమైందని చర్చ ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నాయి. మద్నూర్ పాత తాలూకా  కేంద్రం మూడు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నందున మద్నూర్ పాత బస్టాండ్ కిక్కిరిసిన ప్రయాణికులతో ఎల్లప్పుడూ కలకలలాడుతుంది. ప్రయాణికులు ఎక్కువ బస్సు సర్వీసులు తక్కువగా ఉండటం,గంటల తరబడి బస్సుల కోసం వేచి చూడడం, మూత్రం వచ్చినా మరుగుదొడ్డికి వచ్చిన ప్రయాణికులకు తప్పని తిప్పలు. ఎందుకంటే మూత్రానికి వెళ్లాలన్నా మరుగుదొడ్డికి వెళ్ళాలన్నా, స్థలం లేక నానా తంటలు పడుతున్నారు. తాలూకా కేంద్రం పుట్టి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా, బస్టాండ్ లో మరుగుదొడ్లు లేక, మూత్రశాలలు లేక ప్రజలకు అసౌకర్యాలతో నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. పాత తాలూకా కేంద్రం ప్రస్తుతం మండల కేంద్రం మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీకి ఎందరో సర్పంచులు వచ్చారు, వెళ్లారు. బస్టాండ్ సమీపంలో ప్రజల కోసం ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలన్న ధ్యాస కూడా రావడం లేదు. అంటే మద్నూర్ మండల కేంద్రం ఎలాంటి అభివృద్ధి చెందుతుందో, బస్టాండ్ లో ప్రయాణికులు ఎదుర్కొనే మూత్రశాలలు మరుగుదొడ్ల సమస్య ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ప్రజలకు గాని, ప్రయాణికులకు గాని, అత్యవసరమైన సమస్య మూత్ర సమస్య. మరుగుదొడ్డి సమస్య. వీటితో పాటు త్రాగునీటి సమస్య. ఈ మూడు సమస్యలు కూడా తీర్చలేకపోవడం, బస్టాండులో సౌకర్యాలు ఏర్పాటు పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ, పట్టించుకున్న పాపాన లేదని ఆవేదన ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జుక్కల్ ఎమ్మెల్యేగా తోటా లక్ష్మి కాంతారావు గెలుపొందారు. బస్టాండ్ సమస్యల పట్ల నవ తెలంగాణ ప్రచురించిన శీర్షికకు స్పందిస్తూ.. వెంటనే నాలుగు లక్షల నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. నిధులు మంజూరు చేయించి నెలలు గడుస్తున్నా.. మంజూరైన నిధులతో మద్నూర్ పాత బస్టాండ్ సమీపంలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు వెంటనే చేపట్టి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.