మద్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం 54వ మహాజనసభ ఈనెల 13న బుధవారం ఉదయం 10:30 గంటలకు సంఘ భవనంలో పరపతి సంఘం చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన జరపటానికి నిశ్చయించడం జరిగిందని, ఇట్టి మహాజన సభకు సంఘం సభ్యులంతా సకాలంలో హాజరుకావాలని, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యనిర్వాన అధికారి జే బాబురావు సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇట్టి మహాజనసభలో 1-10-2023 నుండి1-3-2024 వరకు జమ ఖర్చుల ఆమోదించుట అలాగే2024-2025 అంచనా బడ్జెట్ ఆమోదించుట ఇతర అంశములు అధ్యక్షుల వారి అనుమతితో చర్చించడం జరుగుతుందని, కార్యనిర్వాహణాధికారి తెలిపారు. మహాజన సభ విజయవంతం చేయడానికి సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు.