మద్నూర్ సింగిల్ విండో లో దీర్ఘకాలిక రుణాల బకాయిలు ఐదున్నర కోట్ల 

– బకాయి పడ్డ వసూళ్ల కోసం సింగిల్ విండో అధికారుల కసరత్తులు ,నోటీసుల జారీ
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో గల వ్యవసాయ ప్రాథమిక పరిపత్తి సంఘం సింగిల్ విండోలో దీర్ఘకాలిక రుణాల కింద ఐదున్నర కోట్ల బకాయిలు పడ్డట్లు సమాచారం. బకాయి పడ్డ రుణాల వసూళ్ల కోసం సింగిల్ విండో అధికారులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు మొండి బకాయిల వసూళ్లకు కోసం నోటీసులు జారీ చేస్తున్నారు . ఈ సింగిల్ విండో కార్యాలయ పరిధిలో 145 మంది రైతులు లాంగ్ టర్మ్ కింద ఎల్ టి రుణాల పేరున భూములు మాడిగేజ్ చేయించి రుణాలు పొందినట్లు సమాచారం.  తీసుకున్న రుణాలు పద్ధతి ప్రకారం కట్టలేక మొండి బకాయిల కింద ఏళ్ళు గడుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం కొత్త ప్రభుత్వం సింగిల్ విండోలో తీసుకున్న రుణాల బకాయిలు వసూళ్లపట్ల అధికారుల తీరు తగదని, ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష జరుపుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. ప్రభుత్వం మారడం ఆ శాఖ మంత్రి సమీక్షలు జరపడం బకాయి పడ్డ వసూళ్ల పట్ల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం, ఈ విషయంపై నవతెలంగాణ మద్నూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సింగిల్ విండో కార్యాలయాన్ని సందర్శించి దీర్ఘకాలిక రుణాల బకాయిల పట్ల సింగిల్ విండో కార్యదర్శి జే బాబురావు తో రుణాలు తీసుకున్నా వారు ఎంతమంది, బకాయి పడ్డ డబ్బులు ఎంత అనే వివరాలు సేకరించగా, 145 మంది ఎల్టి రుణాల కింద ఐదున్నర కోట్ల రూపాయలు రుణ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు మొండి బకాయిల వసూళ్ల కోసం రుణాలు తీసుకున్న రైతులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు విండో కార్యదర్శి జే బాబురావు తెలిపారు. నోటీసులు పొందిన రైతులు తమ బకాయిలు 15 రోజుల్లోగా చెల్లించవలసి ఉంటుందని ఆ తేదీలోగా చెల్లించకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మొండి బకాయిల వసుళ్ళ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.