అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ సేవలందించిన మద్నూర్ తహశీల్దార్

 – ఎండి ముజీబ్ కు అవార్డు
– తహశీల్దార్ సేవలు ప్రశంసనీయం : మండల ప్రజలు
నవతెలంగాణ మద్నూర్: ఇటీవల ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించి ఎన్నికల్లో ఉత్తమ సేవలు అందించిన మద్నూర్ తహశీల్దార్ కు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంస పత్రం అందుకున్నారు. మండల తహశీల్దార్ తమ విధుల్లో ఉత్తమ సేవలు అందించడం గణతంత్ర వేడుకల రోజున అవార్డు అందుకోవడం ప్రశంసనీయమని మండల ప్రజలు తహశీల్దార్ కు అభినందించారు