జాతీయస్థాయి పోటీలకు మగ్గిడి పాఠశాల విద్యార్థిని

Maggidi school student for national level competitionsనవతెలంగాణ – ఆర్మూర్
ఈనెల 16వ తేదీ నుండి 18 వ తేదీ వరకు మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్ 14 వాలీబాల్ ఛాంపియన్షిప్లో  జిల్లా జట్టు మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఇందులో అద్భుత ప్రదర్శన కనబరిచిన  విజ్ఞత  మగ్గిడి క్రీడాకారిణి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల పిడి మధు సోమవారం తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళ్లి అక్కడ పాల్గొనడం జరుగుతుంది.జాతీయ స్థాయికి విజ్ఞత ఎనిమిదవ తరగతి విద్యార్థిని  పాఠశాల నుండి సెలెక్ట్ కావడం పట్ల హెచ్ఎం హరిత , గ్రామ వీడిసి సభ్యులు పాఠశాల సిబ్బంది ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగమణి  తదితరులు హర్షం వ్యక్తం చేశారు.