మామిడిపల్లిలో శోభాయమయంగా చెరువుల పండగ

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పాత చెరువు వద్ద “చెరువుల పండుగ” కార్యక్రమం కొద్దిపాటి రాత్రి సమయం అయినా అశేష ప్రజానీకం వచ్చి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో దేవుడు లాగా సంక్షేమ పథకాలు కెసిఆర్ అందిస్తున్నాడని, భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందని, గత ప్రభుత్వాలు ప్రారంభించి పెండింగ్లో పడిన ప్రాజెక్టులను తెలంగాణ అవసరాలకు అనుగుణంగా పూర్తి చేసుకోవడం జరిగిందని, వృద్ధులకు, ఒంటరి మహిళలకు వికలాంగులకు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ,ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా సాగునీరును పుష్కలంగా అందిస్తున్నది దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వైస్ చైర్మన్ షేక్ మొన్న, కౌన్సిలర్లు ఆకుల రాము, మేడిదాల సంగీత రవి గౌడ్, కోన పత్రి కవిత కాశీరాం, గంగా మోహన్ చక్రు, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..