
నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో వెలసిన కొచ్చేరి మైసమ్మ బోనాల పండుగను గ్రామస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు .ఉదయం నుంచి గ్రామంలో ఓ పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ మహిళలు బోనంతో వచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు మైసమ్మకు భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా బోనాల మనోత్సవాన్ని ఆలయ, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి బొట్టు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మైలారం గ్రామం నుండి గ్రామ శివారులో ఉన్న ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి బోనాల ను సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.