మండలంలోని ధర్మోర గ్రామంలో రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నాగమ్మ విగ్రహ ప్రతిష్టపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణాల మధ్య ద్వాజ స్తంబాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ వీడిసి, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రవి ప్రకాష్, మాక్లూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బురోల్ల అశోక్, మాక్లూర్ సొసైటీ డైరెక్టర్ దయాకర్ రావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.