ఘనంగా లక్ష్మీ దేవర బోనాలు

– ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
నవతెలంగాణ మల్హర్ రావు
సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని లక్ష్మీనగర్ లో ముదిరాజుల ఆరాధ్యదైవం లక్ష్మీ దేవర బోనాలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. ముదిరాజుల అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారికి మొక్కులు సమర్పించారు.మహిళలు నియమనిష్ఠలతో బోనాలు సమర్పించారు. లక్ష్మీ దేవర ప్రతిమలను ఊరేగింపుగా పెద్దమతల్లి ఆలయం నుంచి పురవీధుల్లో తీసుకెళ్లి లక్ష్మీ దేవర ఆలయం ముందు పట్నాలు వేశారు.కుడుక,రవిక,కుంకుమ,పసుపుపు కానుకలుగా సమర్పించారు. కోరిక కోర్కెలు తీరి కొంగు బంగారమగునని ప్రజల ప్రగాఢ నమ్మకం. లక్ష్మీ దేవర బోనాలు, పట్నాలను తిలకించడానికి చుట్టు ప్రక్కల గ్రామాల సందర్శకులు, ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.