పేదరికం చదువుకు అడ్డు కాదు అనే ఆలోచనతో దృఢ సంకల్పంతో చదివిన విద్యార్థినికి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది అయినప్పటికీ కాలేజీలో చేరడానికి డబ్బులు లేకపోవడంతో మహా ఆది సేవాసమితి సభ్యులు ముందుకు వచ్చి విద్యార్థికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే మండలంలోని బురహన్ పల్లి గ్రామానికి చెందిన బలే ఎల్లమ్మ – ఎల్లయ్య దంపతుల కుమార్తె రమ్య జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలనే లక్ష్యంతో చదివింది. చివరికి హైదరాబాద్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు సంపాదించింది. కాలేజీలో చేరడానికి డబ్బులు లేకపోవడంతో మహా ఆది సేవా సమితి సభ్యులు డాక్టర్ సీనపల్లి విజయ్ కుమార్, విక్రమ్ కుమారు ముందుకు వచ్చి 16,500 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యలో రాణించే ప్రతి దళిత కుటుంబానికి మహా ఆది సేవాసమితి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు సమయాన్ని వృధా చెయ్యకుండా పట్టుదలతో చదివి విద్యకి పేదరికం అడ్డు కాదనేదాని రుజువు చేయాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బాల్య దశ నుండే సరైన శిక్షణ అవసరమని తెలిపారు. ఇప్పటి వరకు మహా ఆది సేవ సమితి ఆధ్వర్యంలో ఉన్నత చదువులు చదివే 197 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జోగుల కుమారస్వామి, పసులాది నరేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.