గణేష్ ఉత్సవాల్లో మహా అన్నదానం

Maha Annadanam in Ganesh Utsavamనవతెలంగాణ – తిరుమలగిరి 
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సంత ఏరియాలో మంగళవారం రాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 14 వ వార్డు కమిటీ సభ్యులు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.నరేష్, మాజీ వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్ మాట్లాడుతూ.. గత పది రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం హార్శించదగ్గ విషయమని అన్నారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహాదానమని అన్నారు. అదేవిధంగా నవరాత్రుల పూజల వల్ల ఈ సంవత్సరం దేవుడు అందరిని పదికాలాలపాటు చల్లగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాల్,మున్సిపల్  అధ్యక్షులు పేరాల వీరేష్, 14వ వార్డు ఇంచార్జ్  ఫతేపురం సుధాకర్, కందుకూరి విష్ణు, మున్సిపల్ కౌన్సిలర్  పోన్న రాజ్యలక్ష్మి, బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.