RFCL ఎదుట లారీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా…

నవతెలంగాణ- గోదావరిఖని
ఆర్.ఎఫ్.సి.ఎల్ కంపెనీ లోడింగ్ విషయంలో గోదావరిఖని ఏరియా లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి, సలహాదారులు తంగెడ పాండు రంగా రావు, ప్రధానకార్యదర్శి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ రావు  ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం కంపెనీ ఎదుట లారీ యజమానులు, డ్రైవర్లు క్లీనర్లు , సమీప ప్రభావిత గ్రామ ప్రజలతో కలిసి మహా దర్నా కార్యక్రమం నిర్వహించారు..
ఈ సందర్భంగా అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ,  ఆర్.ఎఫ్ సి ఎల్ కంపెనీ లారీ యజమానుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తూ, కంపెనీలో ఉత్పత్తి అయిన యూరియాను కేవలం వ్యాగన్ల ద్వారానే సరఫరా చేస్తున్నదని,  కంపెనీ పునర్నిర్మాణం కోసం ఇక్కడి స్థానిక నాయకులు, సమీప గ్రామ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలను, త్యాగాలను ఓర్చుకుంటే, నేడు కనీసం కంపెనీ మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని, గోదావరిఖని ఏరియా లారీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా 800 మంది లారీ  యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు మరియు పరోక్షంగా దాదాపుగా 5000మంది కేవలం లోడింగు పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని,  ఆర్.ఎఫ్.సి.ఎల్ కంపెనీ ప్రారంభమైందంటే తమకు లోడింగ్ దొరుకుతుందని ఎంతో ఆశతో ఎదురుచూసిన మాకు కంపెనీ అధికారుల తప్పుడు, అనాలోచిత నిర్ణయాల వల్ల ఉపాధి కరువవుతుందని,  బాధతో,ఆవేదనతో నేడు తమ ప్రధాన న్యాయమైన డిమాండ్లు అయిన రోడ్డు మార్గం ద్వారా లారీలలో కంపెనీలో ఉత్పత్తి అయిన యూరియాను సరఫరా చేయించాలని, టెండర్ల విషయంలో స్థానిక రోడ్డు రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత కల్పించాలని అదేవిధంగా ఉత్పత్తి అయిన యూరియాను వ్యాగన్ల ద్వారా కోటా తగ్గించి లారీల ద్వారా రవాణాను పెంచేలా చేయాలనీ ధర్నా చేస్తున్నామని ఇకనైనా కంపెనీ అధికారులు తమ నిర్ణయాలను మార్చుకొని  ఇక్కడ స్థానిక లారీల ద్వారానే ఉత్పత్తి అయిన యూరియాను  రవాణా చేయడానికి అవకాశం కల్పించాలని, అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని పత్రికాముఖంగా కోరడం జరిగింది. ఈ న్యాయమైన ధర్నాకు గోదావరిఖని ఏరియా  డ్రైవర్ల సంఘం, మెకానిక్ల సంఘం, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి, పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ ధర్నా  కార్యక్రమంలో లారీ యజమానుల సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శి బాబురావు, కోశాధికారి నరసింహారెడ్డి, ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా, కార్మిక  సంఘాల ప్రధాన కార్యదర్శి మురళి, డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు రషీద్, డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు బాట్టు రవి గార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు మరియు సమీప గ్రామ ప్రజలు పాల్గొన్నారు..