శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం

– పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దిగాల గణేష్ గుప్తా త పాటు నగర మేయర్ దండు నీతూ కిరణ్ గురువారం పాల్గొని అమ్మవారికి దర్శించుకున్నారు. శ్రీ భక్త మార్కండేయ సహిత శివపంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కలశ జీవధ్వజ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,సత్యప్రకాశ్,సూదం రవిచందర్, దండు చంద్రశేఖర్,ముఛ్కూర్ నవీన్,తడ్కల్ శ్రీను,పాల్తి రవి కుమార్, కొవూరి జగన్, చిదురా శ్రీనివాస్ ,కసుబ సంపత్,గర్పల్లి ప్రవీణ్,పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు నర్సయ్య సెక్రటరీ ఎనగందుల మురళి,కార్పొరేటర్ ధర్మపురి,సాయి, సత్యపాల్, బిల్లా మహేష్,నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.