విద్యార్ధుల ఫీజులు చెల్లించాలని “మహా ర్యాలీ”

R krisnaiah– 16లక్షల75వేలమంది విద్యార్ధుల ఫీజులు చెల్లించాలి
– బి.సి విద్యార్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ 
– ముఖ్య అథిదిగా పాల్గోన్న‌ ఆర్ కృష్ణయ్య 
న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్
16లక్షల75వేలమంది విద్యార్ధుల ఫీజులు చెల్లించాలని, “కాంట్రాక్టర్ల బిల్లులు వేలకోట్లు చెల్లిస్తున్నారు విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు వందల కోట్లు కూడా చెల్లించడం లేదని . ఇదేమి న్యాయం – ఇదేమి ప్రభుత్వం అంటూ నినాదాలు ఇస్తూ విద్యార్థులు ఈసిఐఎల్ వద్ద భారీ ప్రదర్శన జరిపారు. బి.సి విద్యార్ధి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆద్వర్యంలో జరిగింది, ముఖ్య అతిధిగా మాజీ ఎం పి ఆర్వి కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులు చెల్లించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి స్కాలర్ షిప్ లకు కూడా బిల్లులు ఇవ్వడం లేదన్నారు. గత నాలుగు నెలలుగా విద్యార్థులు రోడ్లమీద వచ్చి ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆర్థిక శాఖ మంత్రికి కాంట్రాక్టర్లు అంటే చాలా ప్రేమ ఉంది. కానీ విద్యార్థులు అంటే పట్టించుకోవడం లేదు. తన వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. గతంలో స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీ బంద్ చేస్తే విద్యార్థుల చదువు దెబ్బ తింటుందని కాలేజీ యాజమాన్యాలకు నచ్చజెప్పి పునః ప్రారంభ చేసాము. కానీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు కలిపి నిరవదికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11నెలలు నడుస్తున్న ఇంతవరకు బకాయిలు చెల్లించడానికి ముందుకు రావడంలేదని విమర్శించారు. ఈ 11 నెలల కాలంలో ప్రభుత్వం తెచ్చిన అప్పులు 80వేల కోట్లతే ఆదాయం ఏంటంటే ఒక లక్ష కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లించారు? ఇతర బిల్లులు ఎన్ని చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు 4వేల కోట్లు తక్షణమే చెల్లించాలని కోరారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలేజీ యాజమాన్యాలు కోర్సు పూర్తి అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత కోర్సులలో సీట్లు వచ్చిన చదవలేక పోతున్నారు. అలాగే ఉద్యోగాలు వచ్చిన సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్నారు. విదేశీ విద్యకు పోలేక పోతున్నారు. ఫీజులు కట్టే సోమత లేని వారు. ఈ స్కీం యున్నదని చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం మొదటి ప్రాడన్యత ఇచ్చి బడ్జెటు విడుదల చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెండు దశలలో బడ్జెట్ విడుదల చేయాలని సూచించారు.
కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు సంవత్సరానికి 5500 రూపాయలు చెల్లిస్తే అవి ఎక్కడ సరిపోతాయని కృష్ణయ్య ప్రశ్నించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి 20వేల రూపాయలు, కర్ణాటక రాష్ట్రంలో 15వేల రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తే కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు పెద్దపీట వేస్తే ఇక్కడ మన రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేసి అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ 5500 ఇస్తే ఎక్కడ సరిపోతాయి. అందుకే డిగ్రీలు చదువుకుంటున్న విద్యార్థులకు 5500 నుండి 20 వేలకు పెంచాలని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..
ఈ ర్యాలీ లో భూపేష్ సాగర్, మనోజ్, వెంకన్న గౌడ్, అంజి, సతీశ్, అనంతయ్య, రాజేందర్, చంద్రశేఖర్, హరీష్, నిఖిల్, అరవింద్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు