ఫైనల్లో మహబూబ్‌ నగర్‌, టీడీసీఏ ఎలెవన్‌

 Sports– టీడీసీఏ అండర్‌-17 టీ20 టోర్నమెంట్‌
హైదరాబాద్‌ : తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) నిర్వహిస్తున్న అండర్‌-17 టీ20 టోర్నమెంట్‌లో మహబూబ్‌నగర్‌, టీడీసీఏ ఎలెవన్‌ సత్తా చాటాయి. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన సెమీఫైనల్స్‌లో మహబూబ్‌ నగర్‌, టీడీసీఏ ఎలెవన్‌ విజయాలు సాధించి ఫైనల్లోకి ప్రవేశించాయి. తొలి సెమీఫైనల్లో తొలుత ఆదిలాబాద్‌ 20 ఓవర్లలో 116/10 పరుగులు చేయగా.. మహబూబ్‌నగర్‌ 15.1 ఓవర్లలోనే 117/2తో లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో సెమీఫైనల్లో రంగారెడ్డి 19.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టీడీసీఏ ఎలెవన్‌ 18.4 ఓవర్లలోనే 137/3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నేడు జరిగే టైటిల్‌ పోరులో మహబూబ్‌ నగర్‌, టీడీసీఏ ఎలెవన్‌ తలపడతాయి.
అభినవ్‌ శతకం : టీడీసీఏ టోర్నమెంట్‌లో రంగారెడ్డి జల్లా బ్యాటర్‌ అభినవ్‌ గౌడ్‌ తొలి శతకం నమోదు చేశాడు. నల్గొండతో క్వార్టర్‌ఫైనల్లో అభినవ్‌ 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 52 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. మెరుపు శతకం సాధించిన అభినవ్‌ను టీడీసీఏ అధ్యక్షులు అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, వ్యాయాయ విద్య ఉపాధ్యాయ సంఘం (పెటా టిఎస్‌) అధ్యక్షులు రాఘవరెడ్డి అభినందించారు.