నవతెలంగాణ – జుక్కల్
కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ ఈనెల 10న ఉదయం ఇందిరా పార్క్ హైదరాబాదులో జరిగే ప్రజా సంఘాల మహాధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ అన్నారు. అలాగే జుక్కల్ నియోజకవర్గంలోని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను సవరించి, కార్మికులకు, రైతులకు, ఉపాధి హామీ కూలీలకు బడ్జెట్ పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చ్ నెలలో తెలంగాణ ప్రభుత్వం పెట్టబోతున్న బడ్జెట్ ను కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు అనుకూల బడ్జెట్ లొ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు.