మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ పత్రాలు అందజేత

Mahalakshmi Gas Subsidy Documents Issuerనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న గ్యాస్ సబ్సిడీ పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ అందజేస్తున్నందున గ్రామంలో సబ్సిడీ పత్రాలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకులు, సొసైటీ చైర్మన్ రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.