ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన మహానీయుడు గాంధీ

 Adilabadనవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
దేశంతో పాటు ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన మహానీయుడు మహాత్మ గాంధీ అని ఎంపీ గోడం నగేష్‌ అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ చౌక్‌లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పాయల శంకర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశ మాజీ ప్రధాన మంత్రి లాల్‌ బహదూర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్‌ మాట్లాడుతూ నీతి నిజాయితీకి నిలువు మహాత్మ గాంధీ అని కొనియాడారు. స్వతంత్య్ర ఉద్యమంలో అందరిని ఏకం చేసి అహింస, సత్యాగ్రహంతో దేశ ప్రజలను ఐక్యం చేశారన్నారు. హంగులు అర్బాటలకు పొకుండా దేశం కోసం జీవించిన వ్యక్తి అని అన్నారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రీ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తు తన పదవీకి రాజీనామ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత కాలంలో ఎన్నో కుంభ కుణాలు, నేరుగా దొరికిపోయిన పదవులు వీడటం లేదన్నారు., మహాత్మ గాంధీలాంటి నిజాయితీ గల నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అహింసాతో సాధించలేనిది ఏది లేదని చెప్పిన మహానీయుడు మహాత్మ గాంధీ అని ఎమ్మెల్యే పాయల శంకర్‌ అన్నారు. గాంధీ చౌక్‌ సుందరీకరణకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్టు తెలిసిందని, మిగిత కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహించేల చూస్తానన్నారు. వీటి కోసం అందరితో కలిసి కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్‌, నాయకులు లాలామున్న, బీంసెన్‌ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌, హరిష్‌, నర్సింములు, గిరిష్‌, ప్రసాద్‌, ఉల్లాస్‌, నాయకులు పాల్గొన్నారు..
నివాళులర్పించిన మున్సిపల్‌ చైర్మెన్‌..
మహాత్మ గాంధీ చూపిన అహింస మార్గంలోనే పయనించాలని మున్సిపల్‌ చైర్మెన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించినంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ పార్క్‌లో గాంధీజీకి పూలమాలు వేసే నివాళులర్పించి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పలువురు మున్సిపల్‌ కార్మికులను ఘనంగా సత్కరించారు. అలాగే ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ పరిశుభ్రత చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో భాగంగా పలువురు మున్సిపల్‌ కార్మికులను చైర్మెన్‌ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్‌, హరిష్‌, నర్సింములు, లయన్స్‌ క్లబ్‌ కింగ్స్‌ అండ్‌ కాటన్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు, ట్రెజరర్‌ పుప్పాల నరేందర్‌, సత్యనారాయణ, గంగయ్య, రవీంద్ర, గిరిష్‌ ప్రసాద్‌, ఉల్లాస్‌ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. గాంధీ చౌక్‌లో ఆర్యవైశ్య సంఘ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింస మార్గాన్ని అవలంబిస్తు ముందుకు సాగాలని డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి అన్నారు. పేదలకు అండగా ఉంటూ వారికి సేవలు చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బండారి సతీష్‌, గిమ్మ సంతోష్‌, షకిల్‌, మంచికట్ల ఆశమ్మ, ప్రేమల పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో…
సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. బుధవారం పట్టణంలోని భుక్తాపూర్‌ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రహీం, రమేష్‌, గణేష్‌, పాషా, సుభాష్‌, నర్సారెడ్డి, రాము, అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
నేహ్రు యువ కేంద్రంలో ఆధ్వర్యంలో..
నేహ్రు యువ కేంద్రంలో ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని బీసీ స్టడీ సర్కిల్లో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వచ్చతపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సెప్టెంబర్‌17 నుంచి అక్టోబర్‌ 2 గాంధీ జయంతి వరకు స్వచ్ఛ తా హీ సేవ కార్యక్రమాలను చేపట్టామని ఎన్‌వైకే యూత్‌అఫీసర్‌ సుశీల్‌ బర్డ్‌ అన్నారు. ఇందులో పరిసరాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు ప్రవీణ్‌, రమేష్‌, సిబ్బంది మజీద్‌, నరేష్‌, ఎర్రమ్మ పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాలలో..
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి వేడుకలను ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాలలో ఆవరణలో స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అతిక్‌ బేగం, రఘు గణపతి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓ పృథ్వి, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ చంద్రకాంత్‌, కళాశాల సిబ్బంది, క్యాడట్లు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో..
అహింసే ఆయుధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం మహాత జయంతిని పురస్కరించుకుని గాంధీ చౌక్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్ముడు చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. అనంతరం భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ మహాత్మగాంధీ తన అహింస సిద్ధాంతంతో రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి వారిని దేశం నుంచి తరిమే వరకు పోరాడిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు తడిసేన వెంకట్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుదురుపాక సురేష్‌, సీనియర్‌ నాయకులు సవిన్‌ రెడ్డి, రహీమ్‌ ఖాన్‌ ఉన్నారు.
బోథ్‌ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో బుధవారం జాతీపిత మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ చైర్మెన్‌ భోడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు జాతీపిత అడుగుజాడల్లో నడవాలన్నారు. అనంతరం మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మార్కెట్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ అబ్రార్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గొర్ల రాజు యాదవ్‌, నాయకులు మెరుగు భోజన్న, వి.రాజశేఖర్‌, కురుమే గంగారాం, గడ్డం సురేందర్‌, షేక్‌ అబూద్‌ పాల్గొన్నారు.