బీఎస్పీతోనే మహనీయుల ఆశయాలు సాధ్యం

– బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
మహనీయుల ఆశయాలు సాధ్యం కావాలంటే అది కేవలం బీఎస్పీ తోనే సాధ్యమని బీఎస్పీ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ కోమటిరెడ్డి సాయి తేజ రెడ్డి అన్నారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బీఎస్పి జిల్లా కమిటీ బీఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్‌ కోమటిరెడ్డి సాయి తేజ రెడ్డిని ప్రకటించింది. ఈ సందర్భంగాఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి సాయి తేజ రెడ్డి మాట్లాడుతూ బహుజన వాదానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. ప్రతి ఒక్కరు ఏనుగు గుర్తుపై ఓటు వేసి బీఎస్పీ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేట్‌ మహిళా కన్వీనర్‌ నర్రా నిర్మల, జిల్లా ఇన్చార్జ్‌ పంబాల అనిల్‌, జిల్లా ఇంచార్జ్‌ అంకెపాక శ్రీనివాస్‌,జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఒంటిపాక యాదగిరి, జిల్లా జనరల్‌ సెక్రెటరీ కత్తుల కాన్షిరం, జిల్లా ఈసీ నెంబర్‌ గ్యార మారయ్య, జిల్లా మహిళా కన్వీనర్‌ పోకల ఏలిజబెత్‌ జిల్లా మహిళా కన్వీనర్‌, గోస్కొండ కవిత, జిల్లా కోశాధికారి చాంద్‌ పాషా, నియోజకవర్గ అధ్యక్షుడు పెరిక అభిలాష్‌, నియోజకవర్గ కార్యదర్శి పందిరి సైదులు, దున్న లింగస్వామి, కనగల్‌, తిప్పర్తి మండల నాయకులు పాల్గొన్నారు.