ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు 

Mahankali Ammavari Bona

– భారీగా హాజరైన భక్తి జనం

– బోనాల ఉత్సవాల్లో గ్రామంలో పండుగ వాతావరణం 
– శివశక్తులతో బోనాలను ఊరేగిస్తున్న భక్తులు 
నవతెలంగాణ – మిరుదొడ్డి 
ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని మీరుదొడ్డి మండల కేంద్రంలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఉదయాన్నే మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించరు అనంతరం బైండ్ల పంబల వారి నుత్యాలు ఆటలు డప్పు చప్పుల మధ్య యువత కేరింతలతో శివసత్తుల ఊరేగింపుతో మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మాంకాళి అమ్మవారిని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కోరికలు తీర్చాలని మొక్కుకున్నారు. అనంతరం మిరుదొడ్డి గ్రామానికి చెందిన కుంట నారాయణ అమ్మవారికి వెండి కిరటం ను అమ్మవారికి అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.