కాంగ్రెస్ పార్టీకి రాజీనామా… మహంకాళి రాజేష్ ఖన్నా

నవతెలంగాణ-చౌటుప్పల్:చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామానికి చెందిన మహంకాళి రాజేష్ ఖన్నా మునుగోడు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి, కాంగ్రెస్ పార్టీకీ సోమవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి అవకాశాలు కల్పిస్తాలేరని మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నానని మహంకాళి రాజేష్ ఖన్నా తెలిపారు. పాల్వాయి స్రవంతి రెడ్డి బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు రాజీనామాల పర్వం కొనసాగుతోంది.