లోక కళ్యాణం కొరకే మహాన్యాస రుద్రాభిషేకం

నవతెలంగాణ – శంకరపట్నం
లోక కళ్యాణం కొరకే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు లింగమూర్తి పేర్కొన్నారు. ఆదివారం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం బ్రహ్మి విద్యాశ్రమ ఆవరణలో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో భాగంగా గత 2020 డిసెంబర్ నుండి 2025 అక్టోబర్ వరకు 100 మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించుటకు సంకల్పించినట్లు, వెల్లడించారు. అందులో భాగంగా కేశవపట్నంలో 85వ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నటున్నట్లు, ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఈశ్వర మహా లింగానికి పంచామ్రుతాలతో అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని అభిషేక క్రతువులో పాలు పంచుకున్నారు. ఈ క్రతువుతో ప్రజలు రోగ పీడ నివారణతో పాటు ఆయురారోగ్యాలను పొందుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన భజనలు భక్తులను కట్టి పడేశాయి. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో హనుమాన్ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తనుకు ఓంకారం, అధ్యక్షుడు తనుకు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.