నవతెలంగాణ – జుక్కల్
శ్రీ అఖిలభారత హనుమాన్ దీక్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో సామూహిక మహాపాదయాత్ర హనుమాన్ దీక్ష పీఠాధిపతులైనటువంటి శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామి వారి యొక్క మంగళ శాసనాలతో మహాపాదయాత్ర 24_3-2024 ఆదివారం రోజున జుక్కల్ మండలంలోని కేమరాజ్ కల్లాలి హనుమాన్ మందిర్ నుండి సలాబత్ పూర్ (మిర్జాపూర్) హనుమాన్ మందిర్ వరకు ఉదయం 6 30 నిమిషాలకు ప్రారంభం, మధ్యాహ్నం 12-గంటల30 నిమిషాలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ వారి పాదపూజ, ప్రవచనము మరియు మహా అన్నదాన ప్రసాదం కలదు, అన్నదాత శ్రీ కులకర్ని రమేశ్ దేశాయ్ కుటుంబ సభ్యులు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గారు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే ఆహ్వానించువారు కేంరాజ్ కల్లాలి హనుమాన్ దీక్ష సేవా సమితి జైశ్రీరామ్ జై హనుమాన్ జి జ్ఞానేశ్వర్ గురుస్వామి , సమస్త గ్రామప్రజలు కులకర్ణి రమేష్ గణేష్ రావు దేశాయ్ మాజీ సర్పంచ్ కల్లాల్ కల్లాలి నుండి పాదయాత్రలో వచ్చు స్వాములకు, సివిల్ స్వాములకు, అమ్మ స్వాములకు పిల్లలకు,వచ్చుటకు. మిర్జాపూర్ నుంచి కల్లాలి వరకు వచ్చుటకు, ట్రాక్టర్లు, ఆటోలు తిరుగు ప్రయాణంనకు ఏర్పాట్లు ఉండును, కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోని పాదయాత్ర కార్యక్రమం విజయ వంతం చేయగలరని నిర్వాహకులు రమేష్ దేశాయి పేర్కోన్నారు.