మహారాజకి రెస్పాన్స్‌ సూపర్‌

మహారాజకి రెస్పాన్స్‌ సూపర్‌విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్‌ సినిమా ‘మహారాజ’. నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వంలో ప్యాషన్‌ స్టూడియోస్‌, ది రూట్‌ బ్యానర్స్‌ పై సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనిసామి నిర్మించారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ హౌస్‌ ఎన్‌విఆర్‌ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలో మ్యాసీవ్‌గా రిలీజ్‌ చేసింది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ థ్యాంక్యూ మీట్‌ని నిర్వహించింది. హీరో విజరు సేతుపతి మాట్లాడుతూ, ”మహారాజ’కి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా గురించి అందరూ గొప్ప మాట్లాడటం వింటుంటే చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా ఉంది. మా సినిమాని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. ‘తెలుగు ఆడియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌. కథ, స్క్రీన్‌ ప్లే, పెర్ఫార్మెన్స్‌ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని డైరెక్టర్‌ నితిలన్‌ సామినాథన్‌ అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ,’కలెక్షన్స్‌తో తెలుగు ప్రేక్షకులు విజరు సేతుపతికి బ్రహ్మరథం పట్టారు. మొదటి రోజు నుంచే స్క్రీన్‌ పెంచుతూనే ఉన్నాం. రిపీట్‌ ఆడియన్స్‌ వస్తున్నారు. ఈ ఏడాదిలో ‘హనుమాన్‌’ తర్వాత ఇంతపెద్ద హిట్‌ ఈ సినిమానే అని నమ్ముతున్నాను’ అని తెలిపారు.