
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నాపల్లి లో మహారాణి శీలం జానకీ బాయి విగ్రహవిష్కరణ, గ్రాంథాలయంను బుధవారం ప్రారంభోత్సవం చేపట్టనున్నట్లు సర్పంచ్ తెలు విజయ్ కుమార్ మంగళవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో బుధవారము ఉదయం 10:30 కు సిర్నాపల్లి గడి ఆవరణలో సిర్నాపల్లి సంస్థానాదీశ్రురాలు శీలం జానకీబాయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం, గడిలోని మొదటి అంతస్థులో గ్రంథాలయం ప్రారంభం ఉందని ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్, డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్,ఇందల్ వాయి సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ లు వస్తున్నారని తెలు విజయ్ కుమార్ వివరించారు.గ్రామ పంచాయతి పాలకవర్గం, గ్రామాభివృద్ది కమిటి, గ్రామ ప్రజలు, యువకులు అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమంలో చేపడ్తున్నమని తెలిపారు.