గ్రామీణ రోడ్లకు మహర్దశ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌

– కడ్తాల్‌ మండలంలోని గిరిజన తాండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-ఆమనగల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ప్రత్యేక నిధులతో గ్రామీణ రోడ్లకు మహర్ధశ పడుతుందని కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ అన్నారు. కడ్తాల్‌ మండలంలోని ఆయా గిరిజన తాండాలకు ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి నిర్మిస్తున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన తాండాలో మన పాలనా అనే నినాదంతో 500 జనాభా కలిగిన ప్రతి గిరిజన తాండాను గ్రామ పంచాయతీగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందని అన్నారు. ఆందులో భాగంగా తాండాల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి పెద్దపీట వేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని నార్లకుంట తాండా, బోయిన్‌ గుట్ట తాండా, వెలుగు రాల్ల తాండా, నాగిరెడ్డి గూడ, పుల్లేరు బోడు తాండా, కాన్గుబావి తాండా, పోచమ్మ గడ్డ తాండా, బాలాజీ నగర్‌ తాండా, రేకుల కుంట తాండాలకు రూ.14.55 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా తాండాలో డప్పుల దర్వులతో గిరిజన యువతులు, మహిళలు ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు వీర తిలకం దిద్ది ఘనస్వాగతం పలికారు. అనంతరం గిరిజన సాంప్రదాయంలో నత్యం చేస్తూ ప్రజాప్రతినిధులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, కడ్తాల్‌ మండల జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, సర్పంచులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, ముద్వెంటి సులోచన సాయిలు, రవీందర్‌ రెడ్డి, హంస మోత్య నాయక్‌, భారతమ్మ నర్సింహ గౌడ్‌, ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్‌ నాయక్‌, బొప్పిడి గోపాల్‌, మంజుల చంద్రమౌలి, ప్రియా రమేష్‌, ఉపసర్పంచ్‌ శారదా పాండు నాయక్‌, ఏఎంసీ డైరెక్టర్‌ లాయఖ్‌ అలి, నాయకులు విజయ భాస్కర్‌ రెడ్డి, బాచిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, జోగు వీరయ్య, గంప శ్రీను, జర్పుల లక్పతి నాయక్‌, బీక్యా నాయక్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.