రాష్ట్ర పండుగగా మహర్షి వాల్మీకి జయంతి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. వాల్మీకి జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.