
ప్రముఖ స్వతంత్ర సమరయోధులు,జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి ని మంగళవారం మండల పరిషత్,వాసవి క్లబ్,ఆర్యవైశ్య సంఘాలు ఆద్వర్యంలో నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల గాంధీ విగ్రహానికి ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ మూర్తి పూలమాల వేసి అంజలి ఘటించారు.అశ్వారావుపేట లోని గాంధీ సెంటర్ లో గల గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం మండల అద్యక్షులు,సీనియర్ విలేకరి (ఆంధ్రజ్యోతి) శీమకుర్తి శ్రీనివాసరావు, వాసవి క్లబ్ మండల అద్యక్షులు జల్లిపల్లి దేవరాజ్,చాంబర్ ఆఫ్ కామర్స్ మండల అద్యక్షులు సంక ప్రసాద్ లు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కర్యక్రమంలో ఎంపీడీఓశ్రీనివాసరావు, ఎంపీఈఓ సీతారామరాజు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా కో – ఆర్డినేటర్ కొణిజర్ల ఉమా మహేశ్వర రావు,సీమకుర్తి సుబ్బారావు, ఆర్యవైశ్య ప్రముఖులు కంచర్లరామారావు,సత్యవరపు బాలగంగాధర్,సంపూర్ణ, సోమిశెట్టి కొండ తదితరులు పాల్గొన్నారు.